కలం, వెబ్ డెస్క్: బ్రిటన్ యువరాజు విలియమ్ (Prince William) ముంబయి పర్యటనలో భాగంగా క్రికెట్ లెజెండ్ సచిన్(Sachin Tendulkar)తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. కొద్ది సేపు సచిన్‌కు బౌలింగ్ చేసిన ప్రిన్స్.. అనంతరం బ్యాటింగ్ చేసి కూడా షాట్లు కొట్టి అలరించారు. ఇద్దరు ప్రముఖులు తమ మధ్యలోకి వచ్చి క్రికెట్ ఆడటంతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. అనంతరం వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఉత్సాహపరిచారు. బ్రిటన్‌లోని వేల్స్ సంస్థాన యువరాజు విలియమ్, ఆయన భార్య కేథరీన్ ఇండియా పర్యటనకు వచ్చారు. తొలుత ముంబయికి వెళ్లి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయల్ కుటుంబం రాకను పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది. ప్రిన్స్ విలియమ్ ప్రధాని మోదీతో రేపు భేటీ కాబోతున్నారు.
అప్పుడు చెప్పాను.. ఇప్పుడు ఆడాను..
క్రికెట్ లెజెండ్ సచిన్ మాట్లాడుతూ.. “పదేళ్ల కిందట ప్రిన్స్‌తో కలిసి స్టేడియంలో, మంచి పిచ్ మీద క్రికెట్ ఆడాను. మనం మరోసారి ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడుదామని అప్పుడు చెప్పాను. అన్నట్లుగానే ప్రిన్స్ విలియమ్ (Prince William) ఇప్పుడు నగరానికి రావడం ఆనందంగా ఉంది. ఈ పర్యటనకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నో సవాళ్లను సానుకూల ధోరణిలో పరిష్కరించుకుని ఉత్తమ ప్రపంచాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేదే రాయల్ ఫ్యామిలీ ఆకాంక్ష. అందుకోసం వారు చేస్తున్న కృషి చాలా గొప్పది” అని అభినందించారు.
Also Read : మేఘాలు కాదు.. యమునా నది విషపు నురగల్లోనే భక్తుల ఛత్ పూజలు !
Follow Us On : WhatsApp

