లైంగిక వేధింపులు.. వెటర్నరీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్: సమాజానికి, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన గురువు స్థానంలో ఉన్న కొందరు నీచమైన పనులు చేస్తున్నారు. హోదా, స్థాయి మరిచి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ లోని వెటర్నరీ కళాశాలలో (Siddipet Veterinary College) చోటు చేసుకుంది. విద్యార్థినులపై లైంగికంగా వేధించినట్లు ఆరోపణలతో కాలేజీ ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. బాధిత విద్యార్థినుల్లో ఒకరి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రిన్సిపాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు నేపథ్యంలో పీవీ నరసింహరావు పశు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్ పై రిజిస్ట్రార్ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ప్రిన్సిపాల్ వేధింపుల వ్యవహారంపై గతంలోనే తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తాజాగా, లైంగిక వేధింపుల వ్యవహారంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడంతో వెటర్నరీ కాలేజీలో తీవ్ర కలకలం నెలకొంది. కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read : స్మార్ట్ ఫోన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>