జమ్మూ కశ్మీర్‌లో మరోసారి కాల్పులు

కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ (Jammu Kashmir LoC)  సమీపంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని కన్నారి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భారత జవాన్లు గుర్తించారు. ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో అప్రమత్తమై.. 30 రౌండ్ల పాటు చీకటి ప్రాంతంలోనే కాల్పులు జరిపారు. అటు వైపు నుంచి స్పందన రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. చలి కాలం కావడంతో మంచు ఎక్కువగా పడే సమయంలో ఉగ్రవాదులు జమ్మూలోకి చొరబడే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు.

మరోవైపు, కుల్గాం ఉగ్ర దాడికి పాల్పడినవారి కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి కుల్గాం (Kulgam) పట్టణాన్ని సీఆర్పీఎఫ్, జమ్మూ పోలీసులు చుట్టుముట్టి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులు ఇక్కడే ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్ చేపట్టారు. డీజీపీ నళిన్ ప్రభాత్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇంతవరకు ఉగ్రవాదుల జాడ దొరకలేదు. జమ్మూలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు.

Also Read : గ్రేటర్ వరంగల్‌కు ‘స్పెషల్’ గ్రహణం.. సమస్యల్లో జనం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>