కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ (Nirmal Rural) మండలం వెంగ్వాపేట్ గ్రామంలో పీఏసీఎస్ మంజులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద వనిత విజయశేఖర్, వీడీసీ అధ్యక్షుడు నాలం నరేందర్, పీఏసీఎస్ డైరెక్టర్లు సాద విజయశేఖర్, గోగుర్ల రమేష్, ఉప సర్పంచ్ ఆడెపు రాజన్న, మాజీ ఎంపీపీ సాద సుదర్శన్, సీనియర్ నాయకుడు ఎండీ జమాల్, మాజీ ఎంపీటీసీలు కే. గంగన్న, చిల్ల భోజన్న, సీఈఓ గంగారం, ఏఈఓ అంబాజీ, తదితరులు పాల్గొన్నారు.

