బెంగాల్‌ సీఎం వార్నింగ్.. మరో ఎన్‌కౌంటర్!

‎కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన రథన్ షేక్ అనే వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. ‘పోలీసులపై కాల్పులు జరిపితే, తిరిగి కాల్చకుండా స్వీట్లు పంచుతారా..?’ అని సీఎం సువేందు అధికారి పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఎదురు కాల్పులు చోటు చేసుకుని నిందితుడు మరణించడం గమనార్హం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని సీఎం వార్నింగ్ ఇచ్చారు. బీర్భూమ్ జిల్లా శాంతినికేతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రథన్ షేక్ అనే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడు. కోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేయడంతో అతడిని పట్టుకునేందుకు నవంబర్ 13న బిశ్వజిత్ దాస్ అనే కానిస్టేబుల్ ప్రయత్నించాడు.

మమతా విమర్శలు..

కానిస్టేబుల్ బిశ్వజిత్‌పై కాల్పులు జరిపి రథన్ షేక్ తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రథన్ షేక్ కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత అయిదు నెలల్లో ఇది అయిదో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. వరుస ఎన్‌కౌంటర్లపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బెంగాల్ మరో యూపీలా మారుతోందని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>