ఆరుత‌డి పంటల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న‌

కలం, నారాయణపేట: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలు రైతన్నలు సాగు చేసుకోవాలని టీఆర్‌వీకే శాస్త్రవేత్తలు సూచించారు. ఆదివారం నారాయణపేట (Narayanpet) మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త ఈటెల సత్యనారాయణ మిరప, కంది, ఉల్లి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మిరప పంటలో తామర పురుగుల ఉధృతిని పరిశీలించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు.

అలాగే, రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలు, వాటి ఎంపిక, పంటల ప్రణాళికపై రైతులతో చర్చించారు. ముఖ్యంగా వర్షాధార పరిస్థితులకు అనువైన ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో రైతులతో నేరుగా మాట్లాడి, పంటల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని తగిన శాస్త్రీయ సలహాలు అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>