మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థులు ఖరారు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో రెండో ద‌శ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన (Janasena) పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. నాలుగు మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, 19 మున్సిపాలిటీల్లో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో భాగంగా రెండు కార్పొరేష‌న్లు, మూడు మున్సిపాలిటీల మేయ‌ర్‌, చైర్మ‌న్ స్థానాల‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం ఖ‌రారు చేశారు. శ్రీకాకుళం కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ దానేటి రాధారాణి, కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఆకుల భవానీని ఎంపిక చేశారు.

అలాగే రాజాం మున్సిపాలిటీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా బ‌నిశెట్టి సౌజ‌న్య ల‌త‌, భీమ‌వ‌రం మున్సిపాలిటీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ చుండూరి మ‌ల్లేశ్వ‌రి, తాడేప‌ల్లి గూడెం మున్సిపాలిటీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా పాలూరు వెంకటేశ్వరరావును ఖరారు చేశారు. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ నెల‌ 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>