కలం, స్పోర్ట్స్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ గెలిచింది. కానీ మ్యాచ్ తర్వాత భారత కుర్రాళ్ల సంబరాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. వారి తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ (Mohammad Yousuf) విమర్శలు చేశారు. దీనికి భారత అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా బదులిస్తున్నారు. ఫైనల్ తర్వాత కొందరు భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్ల వైపు దూకుడుగా సంజ్ఞలు చేసినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పకుండా భారత సహాయక సిబ్బంది జోక్యం చేసుకుని ఆటగాళ్లను పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈ సంబరాలపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో యూసుఫ్ సోషల్ మీడియాలో స్పందించారు.
గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటగాళ్లు గౌరవంగా, సంయమనంతో ఉండాలని సూచించారు. మైదానంలో వారి ప్రవర్తన.. కుటుంబం నేర్పిన విలువలను కూడా చూపిస్తుందని పేర్కొన్నారు. సచిన్, సయీద్ అన్వర్‌లను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అయితే యూసుఫ్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఎదురుదాడి చేశారు. గతంలో భారత్‌పై గెలిచినప్పుడు పాక్ ఆటగాళ్లు కూడా దూకుడుగా సంబరాలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఇదే సలహా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో భారత ఆటగాళ్ల సంబరాలపై మొదలైన చర్చ.. ఇరు జట్ల ఆటగాళ్ల ప్రవర్తనపై వాదనగా మారింది.

