జ‌పాన్ ట్రిప్‌లో ర‌ష్మిక-విజ‌య్‌.. ఫోటోలు వైర‌ల్‌

కలం, సినిమా: ఇటీవ‌ల విడిపోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన టాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ష్మిక, విజ‌య్ దేవ‌రకొండ (Vijay Deverakonda) ఆ రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ర‌ణ‌బాలితో సూప‌ర్ హిట్ కొట్టిన ఈ జంట త‌మ ఫ్యామిలీతో క‌లిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు. ఈ ట్రిప్‌లో వీరితో పాటు విజ‌య్ పేరెంట్స్‌, బ్ర‌ద‌ర్ ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా ఉన్నారు. ఈ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోల‌ను విజ‌య్‌, ర‌ష్మిక త‌మ‌త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకున్నారు. దీంతో ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. విజ‌య్‌ తనకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి జపాన్‌లో గడిపిన ఆనందకర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. త‌న ఫేవ‌రెట్ పీపుల్‌తో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానంటూ త‌న పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. విడాకుల రూమ‌ర్స్‌తో నిరాశ చెందిన విజ‌య్‌, ర‌ష్మిక ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్లు మ‌ళ్లీ సంతోషంగా క‌లిసి తిర‌గ‌డం చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>