నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా ‘జన జాతీయ గౌరవ దివస్’

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ (Nirmal Collectorate) కార్యాలయ సమావేశ మందిరంలో భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని జన్ జాతీయ గౌరవ దివస్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక ఆదివాసీ నాయకులతో కలిసి భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన, ‘జన్ జాతీయ గౌరవ దివస్’ వేడుకల్లో అధికారులు కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్ జాతీయ గౌరవ దివస్ గా నిర్వహించి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పెంపొందించామని అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, ఆదివాసీ హక్కుల సాధనకు పాటుపడిన గొప్ప పోరాటయోధుడు బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజనుల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, ఏసీఎంవో శివాజీ, సంఘాల నాయకులు సుంకరి ముత్యం, తొడసం గోవర్ధన్, నైతం భీమ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>