డేంజ‌ర‌స్ కెమిక‌ల్స్‌తో క‌ల్లు త‌యారీ.. క‌ల్తీ నెట్‌వ‌ర్క్‌పై నిఘా!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌ల్తీ క‌ల్లు (Adulterated Toddy) దందా విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోంది. ప‌లు చోట్ల క‌ల్లు కాంపౌండ్లు నిర్మించి ర‌సాయ‌నాలు క‌లిపిన క‌ల్లు విక్ర‌యిస్తూ కొంద‌రు అక్ర‌మార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా న‌గ‌రంలో ప‌లు చోట్ల అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్‌, నాచారం ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో ఆయా చోట్ల‌ కల్లులో నిషేధిత రసాయన‌మైన‌ క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు గుర్తించారు. రెండు చోట్ల కలిపి 264 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌ల్లో మొత్తం న‌లుగురిని అరెస్ట్ చేశారు.

క‌ల్తీ క‌ల్లు త‌యారు చేస్తున్న‌ మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ క‌ల్తీ క‌ల్లు త‌యారీకి ర‌సాయ‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న మ‌రో వ్య‌క్తిని పోలీసులు గుర్తించారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా పిలాయిప‌ల్లికి చెందిన సిద్ధ‌గోని రంగ‌య్య ర‌సాయ‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు గుర్తించి ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. అత‌డి వ‌ద్ద్ 25 కిలోల క్లోర‌ల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నారు. మూడు చోట్ల జ‌రిపిన దాడుల్లో మొత్తం ఐదుగురు అరెస్ట్ అయ్యారు. కాగా, ఈ క‌ల్తీ క‌ల్లు నెట్ వ‌ర్క్ వెనుక ఉన్న ముఠాను క‌నుగొనేందుకు పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>