క్రేజీ డైరెక్టర్‌తో బన్నీ మూవీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

కలం, సినిమా: అల్లు అర్జున్ (Allu Arjun), బోయపాటి కలయికలో 2016లో వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బన్నీ యాక్షన్ సీన్స్, కామెడీ పంచెస్, సూపర్ హిట్ సాంగ్స్ కలగలిపిన ఈ మూవీ ఆయన కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇన్నాళ్లకు మరోసారి కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘సరైనోడు’ను మించేలా బోయపాటి అల్లు అర్జున్ కోసం అద్భుతమైక కథ రెడీ చేశారని టాక్. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్‌లా కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో మైథలాజికల్ సబ్జెక్టుతో డిజైన్ చేస్తున్నారట. బోయపాటి కథకు బన్నీ ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్‌లోనే మూవీ నిర్మాణం కానుంది.

రెండు మూవీలు ఒకేసారి..

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్ ముంబైలో జరుగుతోంది. జనవరి నాటికి అల్లు అర్జున్ పార్ట్ కంప్లీట్ అవుతుందని మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు. అనంతరం ఇప్పటికే కమిట్ అయిన లోకేశ్ కనగరాజ్ మూవీని అల్లు అర్జున్ పట్టాలెక్కించబోతున్నారు. బోయపాటి మూవీని ఆలస్యం చేయొద్దని ఫిక్సయిన బన్నీ.. ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే.. రెండేసి నెలల చొప్పున డేట్స్ అడ్జస్ట్ చేస్తానని ఇద్దరు డైరెక్టర్లకు స్పష్టం చేసినట్లు ఇండస్ట్రీ టాక్. అదే జరిగితే.. 2027లో బన్నీ నుంచి కనీసం రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స సంబరపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>