ఏపీకి మరో తుఫాన్ గండం

కలం, వెబ్ డెస్క్: ఇప్పటికే మరసు తుఫాన్ తో అతలాకుతలం అయిన ఏపీకి మరో తుఫాన్ ( AP Cyclone) గండం పొంచి ఉంది. రాష్ట్రంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య దిశగా కొనసాగుతుంది. ఆదివారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. అయితే తీరం ఎక్కడ దాటుతుందనే దానిపై క్లారిటీ రానుంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారానికి తీవ్ర తుపానుగా మారి, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటనున్నట్లు భావిస్తోంది. తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మురసు తుఫాన్ బీభత్సంతో రాష్ట్రంలో రూ.2484.43కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు సర్కార్ అంచనా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>