కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. తమ కాంబినేషన్‌లో (NTR-Anil Ravipudi) మూవీ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సమయం కూడా దగ్గర్లోనే ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

