గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించిన DLSA కార్యదర్శి

​కలం, ఖమ్మం బ్యూరో: ​బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ (DLSA Secretary Rajendhar) ఉద్ఘాటించారు. జాతీయ బాలల దినోత్సవం, ‘సురక్షిత బచపన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన కొత్తగూడెం మండలంలోని కూలి లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, న్యూ గొల్లగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.

​ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఎం. రాజేందర్ ప్రత్యక్షంగా ముచ్చటించి, వారికి సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో వ్యక్తిగత భద్రత ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అపరిచితులు లేదా ఇతరుల నుంచి ఎటువంటి అసౌకర్య స్పర్శ ఎదురైనా చిన్నారులు ఏమాత్రం భయపడవద్దని, విషయాన్ని దాచిపెట్టకుండా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా సంబంధిత అధికారులకు ధైర్యంగా తెలియజేయాలని ఆయన సూచించారు. ​

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. పావని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గణేష్, శ్రావణి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>