కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్, బంగల్‌పేట్, గాజులపేట్ 11 కేవీ ఫీడర్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం (Power Supply Disruption) ఉంటుందని ఏడీఈ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచి గల్లీ, బుధవార్‌పేట్, గాంధీచౌక్, కబూతర్ కమాన్, బంగల్‌పేట్, నాయుడువాడ, బోయివాడ, రాంరావుబాగ్, గాజులపేట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

