శబరిమలలో అయ్యప్ప స్వాములకు నిర్మల్ వాసుల అన్నదానం

కలం, నిర్మల్: అయ్యప్ప స్వాముల సేవే లక్ష్యంగా శబరిమలలో రెండు నెలల పాటు నిర్వహించే ఉచిత అన్నదాన (Sabarimala Annadanam) కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించారు. అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ (Ayyappa Seva Trust) నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు సమకూర్చిన కిరాణా ముడి సరుకులను (Grocery Supplies) కేరళలోని శబరిమల సమీప నారాయణతోడ్ గ్రామానికి శుక్రవారం తరలించారు. ఈ సందర్భంగా సరుకులతో బయలుదేరిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రెండు నెలల పాటు కొనసాగే అన్నదాన కార్యక్రమానికి నిర్మల్ శాఖ తరఫున తమ వంతు సహాయంగా కిరాణా సరుకులు పంపిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప సన్నిధికి సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో ప్రతిరోజూ భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించనున్నట్లు పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములు ఈ అన్నదాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కనపర్తి విఘ్నేష్, జాప ప్రకాష్, సాదం ఆనంద్, మండాజి మారుతి, జ్యోతిర్మయి, ముద్రకోల శ్రీనివాస్, బద్రి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>