ఓయూలో కరెంటు, నీళ్లు బంద్.. విద్యార్థుల ఆందోళన!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) హాస్టళ్లలో కనీస సౌకర్యాల కొరతపై విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్‌లోని E1, E2, D హాస్టళ్లకు నిలిచిపోయిన విద్యుత్, తాగునీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.

హాస్టళ్లలో సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి నేతలు అధికారులను హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>