కరీంనగర్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతి రాంపూర్‌ (Kothi Rampur)లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సీఐ శ్రీ లోబానంద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది కోతి రాంపూర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఘాసీరామ్, లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా.. 530 గ్రాముల గంజాయి లభించింది. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఎస్సై అభిషేకర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుళ్లు సుమన్, ఆరిఫ్, పరుశురాం, దివ్య పాల్గొన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా పెడుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>