epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

కలం, నిజామాబాద్ బ్యూరో : వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్​ చేయడానికి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎమ్మార్వో శ్రీనివాస్ (MRO caught by ACB)​. ఓ రైతు అనువంశికంగా వచ్చిన భూమిని తన పేరుపై పట్టా చేయించుకోవడానికి తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పట్టా మార్పిడి చేయడానికి తహసీల్దార్​ శ్రీనివాస్​ రూ.50వేలు డబ్బు డిమాండ్​ చేశారు. ఈ విషయమై రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ పంపిన డబ్బును తీసుకెళ్లగా ఎమ్మార్వో శ్రీనివాస్ తన అసిస్టెంట్ అయిన ప్రైవేట్ ఉద్యోగి అజయ్​ను సంప్రదించాలని చెప్పారు. తహసీల్దార్ సూచన మేరకు అజయ్​కి డబ్బులు ఇవ్వడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీ ని ఆశ్రయించాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ ప్రజలకు సూచించారు.

MRO caught by ACB
MRO caught by ACB

Read Also: స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>