కరీంనగర్ హోటళ్లలో ఆహార కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్​

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని కొన్ని హోటళ్లలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐవైఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రోహిత్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు ఏఐవైఎఫ్ (AIYF) నగర ప్రధాన కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటళ్లలో తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యాలపై ఉందని అన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే సంబంధిత హోటల్‌లో తనిఖీలు నిర్వహించి, ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించాలని, కల్తీ ఆహారం విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత హోటల్‌ను తక్షణమే సీజ్ చేసి, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐవైఎఫ్ నగర సమితి తరఫున ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చెంచల మురళి, నగర సహాయ కార్యదర్శి జువ్వాజి తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>