మామిడిగూడలో వీవో భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామపంచాయతీ పరిధిలోని మామిడిగూడ గ్రామంలో గురువారం నూతన వీవో భవన (VO Building) నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel)భూమిపూజ (Bhumi Pooja) నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పూలాజీ బాబా ధ్యాన మందిరం 27వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలాజీ బాబా అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గం, బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పూలాజీ బాబా ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.

భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>