విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ‘ఇంజి వెల్లం’.. విడుదల తేదీ ఖరారు!

కలం, వెబ్ డెస్క్: విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇంజి వెల్లం’  (Inji Vellam Movie) వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఖరారైంది. 2027 జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులను ఎత్తుకుని ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటతో కూడిన మోషన్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి, సాయిపల్లవి తొలిసారి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>