కలం, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్-2’ ఇప్పుడు ఓటీటీ (Jailer 2 OTT) వేదికపై సందడి చేస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రూ.820 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారితో పాటు, మరోసారి చూడాలనుకునే అభిమానులకు ఇది మంచి అవకాశం. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

