కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ వేదికగా నవంబర్ 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్-2026 (Bharat Summit 2026) జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రజాస్వామ్యం, కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పుల వంటి కీలకమైన ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడంతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు.
ఈ సదస్సులో ‘తెలంగాణ రైజింగ్’ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమం, పట్టణీకరణ, సంస్కృతి, క్రీడా రంగాల్లోని ప్రగతిని ఈ వేదిక ద్వారా వివరించనున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సమ్మిట్ చివరి రోజున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

