మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం: జగిత్యాల అదనపు కలెక్టర్

కలం, జగిత్యాల: స్వతంత్ర భారతదేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసి, గుణాత్మక విద్యకు పునాదులు వేసిన తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ అన్నారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల (Jagtial) జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్ సుమారు 11 సంవత్సరాల పాటు దేశ విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. సమగ్ర విద్యావిధాన రూపకల్పనకు పునాదులు వేయడంతో పాటు ప్రాథమిక, ఉన్నత, సెకండరీ విద్యాభివృద్ధికి ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేశారు.

విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాల సాధనకు యూజీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు కృషి చేసి, సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. విద్య ద్వారానే వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని చాటిచెప్పిన ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయాలని ఈ సందర్భంగా స్మరించుకోవాలని అదనపు కలెక్టర్ ప్రసూనాంబ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>