హామీ ఇచ్చి మరిచారా?.. తాలీమ్ తోఫా కోసం రోడ్డెక్కిన మైనారిటీ విద్యార్థులు

కలం, వెబ్‌ డెస్క్‌ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మైనారిటీ విద్యార్థులు (Minority Students) ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ డిక్లరేషన్‌లో పేర్కొన్న తాలీమ్ తోఫా పథకాన్ని (Taleem Tofa Scheme) అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ మైనారిటీ సెల్ నేత సోహైల్ ఆధ్వర్యంలో విద్యార్థులు బంజారా భవన్ సమీపంలో ఆకస్మిక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆర్థిక ప్రోత్సాహం కోసం ప్రకటించిన తాలీమ్ తోఫా హామీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళనకారులు విమర్శించారు.

ఎన్నికల ముందు మైనారిటీల సంక్షేమం కోసం పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆరోపించారు. విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బంజారా భవన్ వద్ద ఒక్కసారిగా నిరసన చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనను అడ్డుకుని బీఆర్ఎస్ మైనారిటీ సెల్ నేత సోహైల్‌తో పాటు పలువురు మైనారిటీ నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>