షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

కలం, స్పోర్ట్స్: దోహాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఈషా సింగ్, మను భాకర్, దివ్య తడిగోల్ సుబ్బరాజు స్వర్ణ పతకం సాధించారు. ఈ ముగ్గురూ కలిసి 1761 పాయింట్లు సాధించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. ఈ పోటీలో దక్షిణ కొరియా 1748 పాయింట్లతో రజతం గెలుచుకుంది.

వియత్నాం 1745 పాయింట్లతో కాంస్యం సాధించింది. భారత జట్టులో ఈషా సింగ్ 590 పాయింట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మను భాకర్ 587, దివ్య 584 పాయింట్లు సాధించారు. వ్యక్తిగత విభాగంలోనూ ఈషా, మను ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే ఫైనల్లో మను భాకర్ 27 హిట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. ఈషా సింగ్ 11 హిట్స్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>