లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి హరీశ్‌రావు భరోసా

కలం, జనగామ: ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ గౌడ్(Lakshman Goud) కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) భరోసా ఇచ్చారు. ఆయన భార్యకు ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జేసీబీ సీజ్ కావడం, భారీ పెనాల్టీలు, అప్పుల భారం, కౌలుకు తీసుకున్న భూమిలో పంట నష్టం, భూమి ప్రొహిబిషన్ జాబితాలో చేరడం వంటి సమస్యలతో లక్ష్మణ్ గౌడ్ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు వివరించినట్లు తెలిపారు. ఈ పరిణామాలు ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని, ఆయన భార్యకు ఉద్యోగం కల్పించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడని, ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా కుటుంబం అనుభవిస్తున్న భూమిపై ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>