కలం, వెబ్ డెస్క్: కాలేజీల్లో సినిమా ప్రమోషన్లు (Film Promotions) నిర్వహిస్తుండటంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సీరియస్ అయింది. ఇక నుంచి ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ఆదేశించింది. ఇటీవల కాలంలో పలు చోట్ల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది. సినిమా ప్రమోషన్లు మాత్రమే కాకుండా ఎలాంటి కమర్షియల్ ఈవెంట్లు కూడా చేయొద్దని ఆదేశించింది.
ఒకవేళ విద్యా సంబంధిత కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించాల్సి వస్తే.. ముందస్తుగానే సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అదే సమయంలో కాలేజీలో జరిగే చిన్న స్థాయి కల్చరల్ ఈవెంట్లు, స్పోర్ట్స్ మీట్స్, టాలెంట్ ప్రోగ్రాంలకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఇటీవల బాగా పెరగడంతో..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు కాలేజీల్లో ఇటీవల సినిమా ఈవెంట్స్ జోరుగా నిర్వహిస్తుండటంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. మరీ ముఖ్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీ(Malla Reddy University)లో ఈవెంట్ల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆదర్శ కుటుంబం సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Film Promotions) నిర్వహించినప్పుడు.. ఏకంగా సినిమా విడుదల రోజు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కాలేజీలో దసరా సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలోనే తెలంగాణ విద్యా శాఖ ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
Also Read : షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం!
Follow Us On: X(Twitter)

