భైంసా మండలంలో వరి కొనుగోళ్లకు శ్రీకారం

కలం, భైంసా: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం భైంసా మండలంలోని (Bhainsa Mandal) దేగాం, వాలేగాం, కుంసర, కామోల్, వానల్పాడ్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధరతో పాటు ఏడు సన్న రకాల ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ అందుతుందని వివరించారు.

అనంతరం దేగాం గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మరో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా షెడ్డు భవనాన్ని ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ జడ్పీటీసీ సోలంకే భీంరావు, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>