కలం, వెబ్ డెస్క్: ఎల్‌నినో (El Nino) పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడం.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకులకు కూడా బాధ్యత ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) అన్నారు. రాష్ట్రంలోని కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు. రబీ పంట సీజన్ లో రూ.38,768 కోట్ల పంట రుణాల లక్ష్యాన్ని బ్యాంకులు పూర్తిస్థాయిలో సాధించాలన్నారు.
ప్రజాభవన్‌లో మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఖరీఫ్–2026 కరవు పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. కరవు ప్రభావిత రైతులకు ఉపశమన చర్యలు, రైతులకు రుణాలు, ఆర్థిక సహకారంపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి సంబంధించి 51వ ఎస్‌ఎల్‌బీసీ SLBC సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల (Minister Tummala) మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం పంట రుణాల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని తుమ్మల సూచించారు. రబీ సీజన్‌కు తక్షణమే పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.38,268 కోట్లుగా అంచనా వేశామని.. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకర్లే ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల బోర్లలో నీరు అడుగంటిందనిపేర్కొన్నారు. రాష్టంలో పప్పుదినుసులు, నూనెగింజలు, ఉద్యాన పంటలకు ఆర్థిక చేయూత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు బ్యాంకులు రుణాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అండగా నిలవాలని సూచించారు.
Also Read : హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు
Follow Us On: Youtube

