రాహుల్ గాంధీతో భేటీ ముగిసింది.. మహేష్​ కుమార్ గౌడ్ కీలక ప్రకటన!

కలం, నిజామాబాద్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో ఢిల్లీలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ (Mahesh Kumar Goud) గౌడ్ భేటీ ముగిసింది. 13 లేదా 14 తేదీల్లో హైదరాబాద్‌కు రాహుల్ రానున్నారని, భారత్ సమ్మిట్లో పాల్గొంటారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఓబీసీల విషయంలో OBC ప్రాతినిధ్యంపై చర్చ జరిగినట్టు వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చానని వివరించారు. సంస్థాగతంగా తెలంగాణలో కాంగ్రెస్ బూత్ స్థాయి నుంచి.. రాష్ట్రస్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలు రాహుల్‌కు వివరించామని పీసీసీ చీఫ్ (Mahesh Kumar Goud) తెలిపారు. నేతల మధ్యల గొడవలు.. పంచాయితీలపై రాహుల్‌తో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఆ వ్యవహారం పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో సర్‌కు వ్యతిరేకంగా సభ.. మెగా బీసీ ర్యాలీకి రాహుల్‌ను రావాలని కోరామని చెప్పుకొచ్చారు. నవంబర్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. సోనియా గాంధీ ఆత్మకథను స్వాగతిస్తున్నామని తెలంగాణలో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Also Read : కేసీఆర్ బాటలో కవిత.. సిద్దిపేట అడ్డాగా సంచలన నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>