కలం, కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం ఇరికుల్ల (Irukulla) గ్రామంలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె శ్రావంతి (35)కి సుమారు 11 సంవత్సరాల క్రితం కరీంనగర్ రూరల్ మండలం ఇరికుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్ (42)తో వివాహం జరిపించారు. వివాహ సమయంలో సంపత్కు రెండు వాహనాలతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.8 లక్షల నగదు ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.
కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ, గత ఆరు నెలలుగా తన తండ్రి వద్ద ఉన్న ప్లాటును విక్రయించి డబ్బులు ఇవ్వాలని భర్త సంపత్ భార్య శ్రావంతిని వేధిస్తూ, తరచూ గొడవపడుతూ శారీరకంగా కొట్టేవాడు. ఈ విషయాన్ని శ్రావంతి తన తండ్రి ముత్తయ్యకు తెలియజేయగా, ఆయన ఇరికుల్ల గ్రామానికి వచ్చి పెద్దమనుషుల సమక్షంలో సంపత్కు నచ్చజెప్పి, కాపురం సజావుగా సాగించాలని సూచించారు. అయినప్పటికీ సంపత్ వేధింపులు కొనసాగించాడు.
ఈ క్రమంలో భర్త వేధింపులు తట్టుకోలేక శ్రావంతి ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల నుంచి 8:00 గంటల మధ్యలో తన ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య (Woman Sravanthi Suicide) చేసుకుంది. ఈ విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న మృతురాలి తండ్రి ముత్తయ్య వరంగల్ నుంచి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో తన కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. తన కుమార్తె మరణానికి భర్త కొత్తూరి సంపత్ వేధింపులే కారణమని కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే నేను ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, అక్కడే ఫిర్యాదు స్వీకరించి ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అనంతరం మృతదేహంపై శవ పంచనామా నిర్వహించి, మరణానికి గల ఖచ్చితమైన కారణాలు నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. తదుపరి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మృతురాలి తండ్రి ఇమ్మడి ముత్తయ్యకు అప్పగించడం జరిగింది.
“ప్రస్తుతం నిందితుడు కొత్తూరి సంపత్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడిని త్వరలో పట్టుకుని, కేసు దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల మేరకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.” – కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి

