కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కెన్ విలియమ్సన్ (Kane Williamson) తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒక్క రోజు ముందు విరాట్ కోహ్లీతో మాట్లాడటం తనకు ఎంతో స్పష్టతను ఇచ్చిందని ఆయన వెల్లడించారు.పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విలియమ్సన్, కోహ్లీతో జరిపిన సంభాషణ అద్దంలో తనను తాను చూసుకున్నట్లుగా అనిపించిందని తెలిపారు. 16 ఏళ్ల కెరీర్, కెప్టెన్సీ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆటపై మక్కువ తగ్గుతున్నప్పుడు ఇతరుల కోసం ఆడకూడదని కోహ్లీ చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని చెప్పారు.
ఆ ఫోన్ కాల్ పూర్తయిన వెంటనే తాత్కాలికంగా కాకుండా పూర్తిగా వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని విలియమ్సన్ నిర్ధారించుకున్నారు. అలాగే 10,000 టెస్ట్ పరుగుల మైలురాయికి కేవలం 500 పరుగుల దూరంలో ఆగిపోవడంపై స్పందిస్తూ, కేవలం రికార్డులు సాధించడం కోసం తాను ఎప్పుడూ ఆడలేదని స్పష్టం చేశారు. విలియమ్సన్ జూన్ 2025లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా, కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారని, ఇద్దరు ఆటగాళ్లు పరస్పర గౌరవంతో ఈ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారని చెప్పారు.

