తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం: మంత్రి వివేక్

కలం, మెదక్ బ్యూరో: సింగూరు జలాలను మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) తెలిపారు. సింగూరు జలాల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి మెదక్ జిల్లా అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రయత్నిస్తానని వివరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రాంచంద్రాపురంలో నిర్వహించిన సమగ్ర పశుసంవర్ధక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాల్గొన్నారు.

త్వరలోనే ప్రధాని మోదీ వద్దకు..

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రకృతి వైపరీత్యమని, ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నియంత్రించలేరని, అయితే ముందస్తు జాగ్రత్తలతో వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని అన్నారు. ఇప్పటికే భూగర్భ జలమట్టాలు సుమారు మూడు మీటర్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలపై ..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల బోర్‌వెల్స్ ఉన్నాయని, అక్టోబర్ నెలలోనే 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వరి సాగుకు అధికంగా నీరు, విద్యుత్ అవసరమవుతాయని, నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలిసి సహాయం కోరుతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>