శాండ్‌పేపర్ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్

క‌లం, స్పోర్ట్స్: 2018 నాటి శాండ్‌పేపర్ వివాదంపై తన సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) పూర్తి మద్దతు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ విషయంపై తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఖవాజా చెప్పిన వివరాలు పూర్తిగా నిజమని స్పష్టం చేశారు. అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణ ప్రక్రియపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణను చాలా హడావుడిగా ముగించారని పేర్కొన్నారు. కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ పక్కనే ఉస్మాన్ ఖవాజా కూర్చున్నప్పటికీ, ఆయనను అసలు విచారించలేదని గుర్తుచేశారు.

అది సరైన విచారణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయాలు మాట్లాడటం ఎవరినీ వేలెత్తి చూపడానికి కాదని, బాధ్యత మరియు పారదర్శకత కోసమేనని వివరించారు. ఈ వివాదం వల్ల తన కుటుంబం ఎంతో వేదనకు గురైందని వార్నర్ చెప్పారు. ఆ సమయంలో టివిల ముందు ఎందుకు ఏడ్చామో తన కుమార్తెలకు వివరించాల్సి వచ్చిందని తెలిపారు. పిల్లలకు ఎప్పుడూ నిజమే చెప్పాలని సూచించినట్లు పేర్కొన్నారు. తన కుటుంబంతో పాటు స్టీవ్ స్మిత్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ కుటుంబాలు కూడా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేసుకున్నారు. నిజం ఎప్పటికైనా బయటకు రాక తప్పదని పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>