కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‍పై తెలంగాణ హై కోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూ వివాదానికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు. కలెక్టర్‍కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.
ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ తమ ఆదేశాలను విస్మరించినట్లు అర్థమవుతోందని జస్టిస్ కె.లక్ష్మణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సదరు భూమి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు అమలు చేసేలా వెంటనే చర్యలు తీసుకుంటామని జడ్జికి చెప్పడంతో.. కలెక్టర్‌కు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను నాలుగు వారాల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
పిటిషనర్లు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్ల కోసం ఎన్వోసీ జారీ చేయాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఇందుకు ఆధారాలుగా సమర్పించారు. పిటిషనర్ల పక్క పక్కనే కొన్ని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినా.. పిటిషనర్ల భూములపై మాత్రం ఆంక్షలు కొనసాగిస్తూ వస్తున్నారు.
అధికారులకు దరఖాస్తు చేసుకున్నా లాభం లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల వినతిని 60 రోజుల్లోగా పరిశీలించాలని గతేడాది ఆగస్టులోనే ఆదేశాలిచ్చింది. ఇంతవరకు అది అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. హై కోర్టు కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

