తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యూఏఈలో ఉద్యోగ అవకాశాలు!

కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నియామకాల్లో జనరల్ హెల్పర్స్‌కు నెలకు AED 1,050 (సుమారు రూ.27,080), షట్టరింగ్ కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్ ఉద్యోగాలకు నెలకు AED 1,350 (సుమారు రూ.34,830) వేతనం అందించనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 22 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నిర్మాణ రంగంలో నైపుణ్యం, పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ తరఫున పలు సౌకర్యాలు కల్పించనున్నారు. ఉచిత వీసా, విమాన టికెట్, వసతి, రోజుకు మూడు పూటల భోజనం, రవాణా సౌకర్యం అందించనున్నారు. దీంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.

కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో TOMCOM కల్పిస్తున్న ఈ విదేశీ ఉపాధి అవకాశాన్ని అర్హులైన యువత ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>