ఈ నెల 12న అడెల్లి పోచమ్మ ఆలయంలో షాపులకు వేలం

కలం, సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయంలో (Adelli Temple) వివిధ వ్యాపారాల నిర్వహణకు ఈ నెల 12న గురువారం వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ భూమయ్య సోమవారం తెలిపారు. ఏడాది కాలపరిమితికి బొమ్మలు, కంకణాలు, సీడీలు, ఫొటోల విక్రయంతో పాటు టెంట్లు, వంటపాత్రలు కిరాయికి ఇచ్చే హక్కుల కోసం వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>