బోల్తాపడిన ప్రయాణికుల బస్సు.. తప్పిన పెను ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని (Lucknow Bus Accident) ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే జీరో పాయింట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యానాలోని రేవారీ నుంచి బీహార్‌లోని ఛాప్రా వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సు వేగంగా ఉండటంతో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడి బయటకు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కాసేపు ట్రాఫిక్ బాగా ఆగిపోయింది. ఆ తర్వాత క్రేన్ వచ్చి బస్సును పక్కకు జరిపిన తర్వాతే వాహనాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>