కలం, దిలావర్పూర్: దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహంలో అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ (Additional Collector Rathod Ramesh) దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతింటిలో లబ్ధిదారులు దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జిల్లాలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారాణి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

