ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్: ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు, దీపావళి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజు తో పాటు దీపావళి పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి మొదటి విడతలో 2500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసామని, రెండో విడతలో మరో రెండు వేల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి ఇప్పటివరకు ధర్మపురి నియోజకవర్గంలో సుమారుగా రూ.275 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించి రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతామని మంత్రి (Minister Adluri Laxman Kumar) హామినిచ్చారు. చామనపల్లి గ్రామాన్ని 100 శాతం ముంపు గ్రామంగా ప్రకటించి.. పరిహారం చెల్లించడానికి రూ.350 కోట్ల జీవో విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>