కలం, ఉట్నూర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని వెడ్మ బొజ్జు (Vedma Bojju Patel) ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

