నబీ ఏడేళ్ల నిరీక్షణకు తెర.. తొలి అంతర్జాతీయ వికెట్!

క‌లం, స్పోర్ట్స్: జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఔకిబ్‌ నబీ (Auqib Nabi) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎట్టకేలకు వికెట్ల ఖాతా తెరిచాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తొలి స్పెల్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఐదో బంతికే సాధించాడు. టిమ్‌ సీఫర్ట్‌ను క్యాచ్‌ ఔట్‌ చేసిన నబీ.. ఆ తర్వాత విల్‌ యంగ్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 1996లో బారాముల్లా జిల్లా షీరీలో జన్మించిన నబీ.. నిలకడైన బౌలింగ్‌తో దేశవాళీ క్రికెట్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024-25, 2025-26 రంజీ సీజన్లలో కలిపి 104 వికెట్లు తీశాడు. 2025-26 సీజన్‌లో 60 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌ తొలి రంజీ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని ఐపీఎల్‌లో రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడినా వికెట్‌ తీయలేకపోయాడు. వన్డే అరంగేట్రంలోనూ 84 పరుగులు ఇచ్చాడు. తొలి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వికెట్‌ దక్కకపోవడంతో అతడి బౌలింగ్‌పై ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో రెండు వికెట్లు తీసి వాటికి సమాధానమిచ్చాడు. బారాముల్లా నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు సాగిన అతడి ప్రయాణంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>