కొత్తగూడెం ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభంపై కార్మికుల డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో : కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగూడెం కేంద్రంగా ఈఎస్ఐ ఆస్పత్రిని (ESI Hospital) వెంటనే ప్రారంభించాలని ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే.డబ్ల్యూ. క్రిస్టోఫర్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రైటర్ బస్తీ సివిల్ కార్యాలయం ఎదుట సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు ఈఎస్ఐ వాటా చెల్లింపులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా, నేటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం శోచనీయమని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం, కార్మికుల వాటా కింద ప్రతినెలా సుమారు రూ. 5 లక్షలు ఈఎస్ఐ ఖాతాకు జమ అవుతున్నప్పటికీ, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం దక్కడంలేదని విమర్శించారు. లక్షలాది రూపాయలు జమ అవుతున్నా ఆసుపత్రిని ప్రారంభించకపోవడం వల్ల కార్మికులు వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, రామవరంలో ప్రతిపాదించిన ఈఎస్ఐ ఆస్పత్రిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే, కార్మికులు మరణిస్తే అందాల్సిన దహన సంస్కార ఖర్చులు, ఆరోగ్య సమస్యలు తలెత్తితే రావాల్సిన బెనిఫిట్లను వెంటనే అమలు చేయాలని కోరారు. యాజమాన్యం తమ నిర్లక్ష్య ధోరణి వీడకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ప్రభాకర్, లక్ష్మణ్, కళ్యాణ్, ప్రేమ్, రామకృష్ణ, సంధ్య, బేగం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>