కలం, వెబ్ డెస్క్: నామినేటెడ్ పోస్టుల(Nominated Posts)పై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే భర్తీ చేస్తామని పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. వివిధ కార్పొరేషన్లు, కమిటీలకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులను కూడా భర్తీ చేస్తామన్నారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అధిష్ఠానానికి పూర్తి నివేదిక ఇచ్చానని స్పష్టం చేశారు.
హై కమాండ్‌లో ఒకప్పటిలా వ్యవస్థ లేదని.. పూర్తిగా మారిపోయిందన్నారు. నాయకుల పనితీరుని పరిశీలించేందుకు పెద్ద వ్యవస్థ పనిచేస్తోందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. మూడు రోజులు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నివేదిక ఢిల్లీకి వెళ్లకుంటే.. అక్కడి నుంచి మెసేజ్ వస్తుంటుందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై ఇంతవరకు చర్చ జరగలేదన్నారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల స్థానాల్లో గెలుపు కోసం మంత్రులతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.
వారిద్దరిపై పీసీసీ ఆగ్రహం..?
ఢిల్లీలో జరిగిన గొడవకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును వివరణ ఇవ్వాలని సూచించినా గాంధీ భవన్‌కు రాకపోవడంపై పీసీసీ చీఫ్ ఆగ్రహంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. పీసీసీ మాటను లెక్క చేయకుండా ఇద్దరు వివరణ ఇవ్వలేదని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హై కమాండ్‌కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై కూడా అందులో పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హై కమాండ్ వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందననే ఆసక్తి నెలకొంది.
Also Read : పుల్లారెడ్డి స్వీట్స్‌కు దెబ్బ మీద దెబ్బ!
Follow Us On: X(Twitter)

