కరీంనగర్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం

కలం, కరీంనగర్ : ఎల్ నినో ప్రభావం దృష్ట్యా కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం (CPM) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి.. అనంతరం జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎల్ నినోను జాతీయ విపత్తుగా ప్రకటించి, తెలంగాణకు రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, జిల్లాకు రూ.2వేల కోట్లు నిధులు విడుదల చేయాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.

కరువు జిల్లాగా గుర్తించి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, కరువు ప్రభావిత రాష్ట్రంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ సాధించేందుకు ఒత్తిడి తీసుకురావాలన్నారు.

కరువు వల్ల జరిగిన పంట నష్టాలను సమగ్రంగా శాస్త్రీయంగా క్షేత్రస్థాయిలో అంచనా వేసి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.జిల్లాలో ఐదు నెలల క్రితం మంత్రులు కరువు నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ, నేటికీ కరువు నివారణ ప్రణాళికను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బీపీఎల్ కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలన్నారు. కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోయి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కరువైందని, కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

వసాయ కూలీలకు కరువు ఉపశమన చర్యల్లో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం అనవసరమైన ఆడంబరపు ఖర్చులను తక్షణమే నిలిపివేసి పొదుపు చర్యలు పాటించాలని, ఆ నిధులను కరువు బాధితుల ఉపశమనానికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం (CPM) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, గుడి కందుల సత్యం, జై బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, రాజేశం, నరేష్ పటేల్, శ్రీనివాస్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>