రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డుకు సీపీ ఆర్థిక సాయం

కలం, కరీంనగర్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన హోంగార్డు ఎండీ ముజీబ్‌కు పోలీస్ శాఖ అండగా నిలిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం (Karimnagar CP Gaush Alam) స్పందించి, హోంగార్డు సంక్షేమ నిధి రూ.40,000 ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. శనివారం హోంగార్డ్ ఆర్ఐ జానీమియా ఆధ్వర్యంలో సీపీ బాధితుడు ఎండీ ముజీబ్‌కు చెక్కును అందజేశారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి కష్టం వచ్చినా పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. కష్ట సమయంలో తక్షణమే స్పందించి ఆర్థిక భరోసా కల్పించినందుకు హోంగార్డు ఎండీ ముజీబ్.. సీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>