15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి : ముదిరెడ్డి 

కలం నల్గొండ:  స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో దేశ రైతు దివాళ చేశాడని సీపీఎం (CPM) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ నెల 15న ఎన్జీ కాలేజీలో జరిగే బహిరంగ సభను (Public Meeting) జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఎం నల్గొండ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్‌లో జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.

రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరుతో ఇతర దేశాల్లో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశంలో పండించిన రైతులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చిందని ఆరోపించారు. ఉపాధి హామీ విధానాలను మార్చి పరోక్షంగా పూర్తిగా రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. నవంబర్ 15 నుండి 18 వరకు తెలంగాణలో అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు ఎన్జీ కాలేజ్ నల్గొండలో నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.

ఈ బహిరంగ సభకు ముందు రెడ్ షర్ట్, రెడ్ శారీ కవాతు నిర్వహించడం జరుగుతుందని, కోలాట బృందాలు, డప్పుల దళాలు, విచిత్ర వేషధారులతో మర్రిగూడ బైపాస్ నుండి ఎన్జీ కాలేజీ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గం నుంచి వేలాది మందిని సమీకరించాలన్నారు. మహాసభల సందర్భంగా ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు, వంగడాలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శన – అగ్రిషో 14 నుండి 16 వరకు పెద్ద గడియారం సెంటర్‌లోని పాత ఆర్ అండ్ బీ ఐబి స్థలంలో నిర్వహించడం జరుగుతుందని, వేలాది మంది ఉత్పత్తులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, కొండా అనురాధ, నల్గొండ, తిప్పర్తి, మాడుగులపల్లి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, పుల్లెంల శ్రీకర్, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, పోలే సత్యనారాయణ, భీమగాని గణేష్, బ్రహ్మానందరెడ్డి, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>